ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి



ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

 న్యూస్ , 7 ఫిబ్రవరి, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు.  ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. 
గురుస్వాములు, వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాఘవరెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఊట్కూరి వెంకట రమణా రెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, పార్టీ నాయకులు పసుల వెంకటయ్య, అంతగిరి వినయ్ కుమార్,మామిడి నరేష్, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మల్లేషం, కాసిపాక రమేశ్, శ్రీనివాస్, ఎం.రాజు,చిట్టి ప్రదీప్ రెడ్డి,మధు,యశ్వంత్, సాయివర్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment