బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి
జనం న్యూస్ , 30 జనవరి , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం పై అక్కేం నాగరాజు
నిరసన వ్యక్తం చేశాడు
20 రోజుల్లో బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభిచాలి లేకపోతే ఎమ్మెల్యే కావ్వంపల్లి సత్యనారాయణ ని మండల కేంద్రం లో తిరగనివ్వమన్నారు
ఈ సందర్బంగా అక్కేం నాగరాజు మాట్లాడుతూ 2016-2017 సంవత్సరం లో దాదాపు గా 3 కోట్ల రూపాయకు పైగా అంచనాతో మొదలు పెట్టిన బిక్క వాగు నిర్మాణం అర కోరగా సాగిన పనులు అప్పటి నుంచి ఏబీవీపీ ఈ బ్రిడ్జి నిర్మాణం మంద కోడి గా సాగుతుంది అని అనేక సార్లు నిరసనలు ధర్నాలు చేసి బ్రిడ్జి నిర్మాణం 90%అయ్యేలా పోరాటాలు చేసిన ఏబీవీపీ గత ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి నిర్మాణం జరిగేలా చేసారు కానీ నేటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం తో మండల ప్రజలు అలాగే జిల్లెల్ల కి వెళ్లే ప్రధాన రహదారి ఇది నిర్మాణం పూర్తి కాకపోవడం తో ప్రజలు బిక్కు బిక్కు మంటూ రాత్రి పూట ప్రయాణం సాగిస్తున్నారు రోడ్డు కి పక్కల కి రక్షణ కవచం లేకపోవడం తో అందులో పడి ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అయినా మానకొండూర్ శాసనసభ్యుడు కావ్వంపల్లి సత్యనారాయణ 2024 ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీ మర్చిపోయారు బ్రిడ్జి నిర్మాణం గెలిచాక చేస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేసారు అని అలాగే బ్రిడ్జి నిర్మాణం 20 రోజుల్లో పూర్తి చేయకుంటే ఎమ్మెల్యే ని ఎక్కడికి అక్కడే అడ్డుకుంటాము అని హెచ్చరించారు.