ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్
• ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్
జనం న్యూస్ , 28 జనవరి , ఇల్లంతకుంట :
జిల్లా ఎస్పీ సూచనల మేరకు
ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్
లో భాగంగా 80 ఆటోలకి కోడ్ తో అనుసంధానం చేసిన స్టికర్స్ అందజేసినట్లు ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రయాణికులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆసురక్షితంగా భావించే ఏదైనా పరిస్థితిని సంఘటనలను ఎదుర్కొన్నపుడు ఆటోకి ముద్రించిన "క్యూ అర్ కోడ్"ను స్కాన్ చేయాలని స్కాన్ చేయగానే వెంటనే డ్రైవర్ ఫోటో,వివరాలతో పాటుగా వాహనంకి సంబంధించిన వివరాలు వస్తాయి స్కాన్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ యాప్ లో ఎంట్రీ చేసి ట్రేస్ ద లొకేషన్ అని ఎంట్రీ చేయగానే వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు.ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్తుంది ఆటోలో ఎక్కినప్పటి నుండి దిగేంతవరకు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని తగు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
గతంలో ఆటో డ్రైవర్ ఏదైనా పోలీస్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే థిస్ ఆటో నాట్ సేఫ్ అనే రెడ్ సిగ్నల్ వస్తుంది ఇది ప్రయాణికులకు సేఫ్ జర్నీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ఆటో లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు.