అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరి రిమాండ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరి రిమాండ్ 


అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ నీ పట్టుకొని 
 ఇద్దరిని రిమాండ్ చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై
శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయం లో పోతూర్ గ్రామం శివారు లో గల బిక్క వాగు నుండి ఇల్లంతకుంట గ్రామం నకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న కంది కట్కూర్ గ్రామానికి చెందిన రంగు రజినీకాంత్, మామిండ్ల పర్శరాములు ట్రాక్టర్ ను కందికట్కూరు లో పట్టుకొని అక్రమంగా ఇసుకను తరలించిన ట్రాక్టర్ ను స్వాధీన పరచుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది.అక్రమంగా తరలించిన వ్యక్తుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment