న్యూస్ , 23 డిసెంబర్ , ఇల్లంతకుంట :
పొత్తూరు రైతువేదిక లో రైతులకు రసాయనిక మందుల పిచికారి చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్య్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ తప్పనిసరిగా రసాయనిక మందులు పిచికారి చేసేటపుడు మాస్క్ కళ్లద్దాలు చేతి గ్లోవ్స్ తప్పనిసరిగా వేసుకోవాలి అని వివరించడం జరిగింది అదే విధంగా రసాయనీక పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు అజాగ్రత్త వహించినట్లయితే వాటి విష ప్రభావం వల్ల చర్మ వ్యాధులు మరియు శ్వాస సంబంధ వ్యాధులు దీర్ఘకాలంలో క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది కావున రైతు సోదరులందరూ రసాయనిక పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు వహించి పిచికారి చేసుకోవాలి ఈ కార్యక్రమంలో కోరమండల్ విభాగం వారి తరఫున రైతులకు సేఫ్టీ కిట్స్ అందజేయడమైనది ఏరియా మేనేజర్ ప్రేమ్ సాయినాథ్ మరియు మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారి లలిత మరియు రైతులు పాల్గొన్నారు.