ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జెట్టి కీర్తన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సాన బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై, ఈనెల 27 నుండి 30 వ, తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటున్న కీర్తనను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేకల పావని మండల ఎస్జిఎఫ్(SGF) కన్వీనర్ సిహెచ్. సంపత్ రావు అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ బట్టు పద్మ శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు.
సిఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక
December 26, 2024
0
సిఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక.
Tags