విద్యార్థినీ విద్యార్థులకు 'షూస్' పంపిణీ
విద్యార్థినీ విద్యార్థులకు 'షూస్' పంపిణీ
న్యూస్ , 11 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో నీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న 168 మంది విద్యార్థులకు మంగళ వారం రోజున షూస్ పంపిణీ చేశారు దాతలు
ఎస్ వీరారెడ్డి ఎస్ ఎ సోషల్,జడ్ పి హెచ్ ఎస్ రేపాక
టి సాంబశివుడు ఎస్ ఎ ఇంగ్లీష్, జడ్పీహెచ్ఎస్ గాలిపెల్లి
కూనబోయిన వినోదఅమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్
ఆర్.రమణారెడ్డి ఎస్ ఎ ఇంగ్లీష్, జడ్ పి హెచ్ ఎస్ ఇల్లంతకుంటదాతల సహకారంతో 50 వేల రూపాయల విలువైన షూస్ పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సి.హెచ్. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి,బాగా చదవాలని తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. ప్రేమలత మాట్లాడుతూ దాతలు ఇచ్చిన షూస్ ను కాపాడుకోవాలని,వాటిని వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం దాతలను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు వి.మహేష్ చంద్ర,ఆర్ రమణారెడ్డి, ఎస్.మధుసూదన్ రావు, ఎం . మంజుల, ఐ. ప్రదీప్ రెడ్డి, పి. అనిల్ కుమార్, పి. సునీత, సి.హెచ్.పుష్పలత, ఏ.కవిత, సి.హెచ్.సంపత్ రావు, ఎన్. సత్తయ్య, ఎస్.సుజాత దేవి
మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
పంట పొలాలను సందర్శించిన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు
పంట పొలాలను సందర్శించిన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు
న్యూస్ , 10 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామానికి చెందిన వివిధ రైతుల సాగు చేస్తున్న వరి మరియు మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించిన జిల్లా ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్), కరీంనగర్ శాస్త్రవేత్తలు రైతులకు తగు సూచనలు చేశారు.
ఈ క్షేత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతు జిల్లాలో వరి పైరు దుబ్బు చేసే దశ నుండి చిరు పొట్ట దశలో ఉంది. జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న వరి పంటలో కాండం తొలిచే పురుగు ఆశిస్తుందని తెలియజేశారు. యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నది. కావున వరి పంటలో ఆశించే కాండం తొలిచే పురుగు నివారణ చర్యలను సూచించారు.
కాండం తొలిచే పురుగు : ప్రస్తుతం వరి పంటలో కాండం తొలిచే పురుగు (మొవ్వ చనిపోయే దశ) ఎక్కువగా నష్టపరుస్తుందని గమనించడమైనది.
• పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎర, సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలి.
ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలను పెట్టి అందులో వారానికి బుట్టకు 25-30 పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలను చేపట్టాలి.
• ముఖ్యంగా పురుగు నివారణకు సిఫారసు చేయబడని ఇతర 10జి లేదా సేంద్రియ గుళికలను యూరియాతో కలిపి వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతు సోదరులు గమనించాలి.
. గత 2-3 సంవత్సరాల నుండి యాసంగిలో ఈ పురుగు పిలక దశలో ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. కనుక నాటు వేసిన 15-20 రోజుల తర్వాత ఎకరానికి కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 4జి 8 కిలోలు లేదా కార్బోప్యూరాన్ 3సిజి 10 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 4 కిలోలు బురద పదునులో వేయాలి. అలాగే అగ్గి తెగులు సోకిన పంట పొలాల్లో తాత్కాలికంగా యూరియా వేయడం ఆపివేయాలి. తరువాత ఈ తెగులు నివారణకు ఐసోప్రోతయోలిన్ 1.5 మి. లీ. లేదా టేబుకోనజోల్+ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.4 గ్రాముల మందిని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే మొక్క జొన్న పంటలో ఆశిస్తున్న కత్తెర పురుగు నివారణకు క్లోరంత్రనిలిప్రోల్ 0.3 మి. లీ. మందుని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ క్షేత్ర సందర్శనలో జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా.కె.మదన్ మోహన్ రెడ్డి మరియు శాస్త్రవేత్త డా.ఏం. రాజేంద్ర ప్రసాద్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారిణి కుమారి లలిత మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
న్యూస్ , 7 ఫిబ్రవరి, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
గురుస్వాములు, వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాఘవరెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఊట్కూరి వెంకట రమణా రెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, పార్టీ నాయకులు పసుల వెంకటయ్య, అంతగిరి వినయ్ కుమార్,మామిడి నరేష్, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, మల్లేషం, కాసిపాక రమేశ్, శ్రీనివాస్, ఎం.రాజు,చిట్టి ప్రదీప్ రెడ్డి,మధు,యశ్వంత్, సాయివర్మ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Comments (Atom)
