గ్రామ సభ లా లేక కాంగ్రెస్ సభ లా ?
• బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్
జనం న్యూస్ , 24 జనవరి , ఇల్లంతకుంట :
పథకాలు పేరుతో గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకుల అతి ఉత్సాహం అప్రజాస్వామికంగా ఉంది అని బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ అన్నారు ,ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ, మండలంలో జరగుతున్న గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులు స్పెషల్ ఆఫీసర్ల లాగా వ్యవహరించడం బాధాకరం అన్నారు ఇప్పటికైనా అధికారులు వారి బాధ్యత వారు నిర్వహించి అర్హులైన సామాన్య ప్రజలకు పథకాలు అందే విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేసారు లేని పక్షంలో లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అన్నారు ఈ కార్యక్రమం లో తాజా మాజీ ఉపసర్పంచ్ లు బుర్ర బాలకిషన్ యాదవ్ ,గోజగాని కిషన్ రావు, రాములు యాదవ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.