Teak-beds-are-provided-by BTR-Foundation-for-a-young-woman's-wedding

యువతి వివాహానికి బిటియర్ ఫౌండేషన్ నుండి టేకు మంచాలు అందజేత Teak-beds-are-provided-by BTR-Foundation-for-a-young-woman's-wedding


 న్యూస్ , 27 డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల వెల్జీపూర్ గ్రామంలో   ఎడ్ల.శంకర్ - శంకరవ్వ  పుత్రిక లాహారీ (శ్వేత)- శశీకుమార్ వివాహనికి టేక్ మంచాలు 10000 పది వేల రూపాయల వస్తువులను బిటియర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు  బెంద్రం.తిరుపతిరెడ్డి
అందజేశారు ఈ సందర్భంగా ఆయన 
మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబాలా కుమార్తెల వివాహలకు ఎల్లపుడు సహాయాలు చేస్తునేవుంటామన్నారు, అన్ని గ్రామాలలోనీ యువకులు ,సేవా ప్రతినిధులు సమాచారమాందించలన్నారు,  కార్యక్రమంలో పాలుగోన్నా సేవా ప్రతినిధులు , నాయకులు బొల్లారం.ప్రసన్న కుమార్ , చిట్యాల. శ్రీనివాస్ , బొల్లారం. పర్శారములు , ఎడ్ల.అనిల్ కుమార్ , మూలిగే.బాలరాజు , కవ్వం.వంశి , ఎడ్ల.ప్రదీప్ , గజ్జల.శ్రీనివాస్ , ఎడ్ల.అరుణ్ , బొంగోని.శ్రీనివాస్ , ఎడ్ల.అభి  నూతన వధువరులను ఆశీర్వదించినారు.

అంగన్వాడి టీచర్లకు ఆర్డర్ కాపీలు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లిMLA-Kavvampalli-handed-over-the-copies-of-the-order-to-the-Anganwadi-teachers

అంగన్వాడి టీచర్లకు ఆర్డర్ కాపీలు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి MLA-Kavvampalli-handed-over-the-copies-of-the-order-to-the-Anganwadi-teachers


మానకొండూర్ నియోజకవర్గంలోని ప్రజాభవన్ కార్యాలయంలో  మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపూర్ కు చెందిన శ్వేత, కందికట్కూరు గ్రామానికి చెందిన నాగమణి, ఇల్లంతకుంట పట్టణానికి చెందిన వందనకు అంగన్వాడి టీచర్ గా ప్రమోషన్ రావడం జరిగింది వారికి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సిఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక

సిఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక.                                   
ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జెట్టి కీర్తన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సాన బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై, ఈనెల 27 నుండి 30 వ, తేదీ వరకు మహబూబ్ నగర్  జిల్లాలో జరిగే  సీఎం కప్  రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటున్న కీర్తనను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేకల పావని మండల ఎస్జిఎఫ్(SGF) కన్వీనర్ సిహెచ్. సంపత్ రావు అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ బట్టు పద్మ శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు.

రసాయనిక మందుల పిచికారి చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

రసాయనిక మందుల పిచికారి చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

 న్యూస్ , 23 డిసెంబర్ , ఇల్లంతకుంట :
 పొత్తూరు రైతువేదిక లో రైతులకు రసాయనిక మందుల పిచికారి చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్య్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి  మాట్లాడుతూ తప్పనిసరిగా రసాయనిక మందులు పిచికారి చేసేటపుడు మాస్క్ కళ్లద్దాలు చేతి గ్లోవ్స్ తప్పనిసరిగా వేసుకోవాలి అని వివరించడం జరిగింది అదే విధంగా రసాయనీక పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు అజాగ్రత్త వహించినట్లయితే వాటి విష ప్రభావం వల్ల చర్మ వ్యాధులు మరియు శ్వాస సంబంధ వ్యాధులు దీర్ఘకాలంలో క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది కావున రైతు సోదరులందరూ రసాయనిక పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు వహించి పిచికారి చేసుకోవాలి ఈ కార్యక్రమంలో కోరమండల్ విభాగం వారి తరఫున రైతులకు సేఫ్టీ కిట్స్ అందజేయడమైనది ఏరియా మేనేజర్ ప్రేమ్ సాయినాథ్ మరియు మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారి లలిత మరియు రైతులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ(అనంతగిరి) రిజార్వాయర్ నుండి నీటి విడుదలWater release from Annapurna (Anantagiri) Reservoir

అన్నపూర్ణ(అనంతగిరి) రిజార్వాయర్ నుండి నీటి విడుదల


•నీటిని విడుదల చేయించిన  ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

ఇల్లంతకుంట మండలం అనంతగిరి రిజర్వాయర్ నుంచి నీటిని వెంటనే విడుదల చేయాలని డాక్టర్ ఎమ్మెల్యే, ఆరోగ్య ప్రదాత డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. 

సోమారంపేట గ్రామానికి చెందిన రైతులు, మాజీ ఎంపీపీ  వుట్కూరి వెంకటరమణారెడ్డి  దగ్గరికి వెళ్లి పంట పొలాలకు నీరు అందించాలని కోరగా, వెంటనే మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  తో మాట్లాడి రైతుల కు నీటిని విడుదల చేయాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేశారు .నీటిని విడుదల చేయించిన  ఎమ్మెల్యే కి,  మాజీ ఎంపీపీ రమణారెడ్డి కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.